MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, ఏప్రిల్ 7: బాక్స్ డ్రైన్ నిర్మాణాలతో వరద ముప్పును నివారిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇవాళ మౌలాలి డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో రూ.1.70 కోట్లతో ఎస్.ఎం.డి.పి బాక్స్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్ సునీత యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మురుగునీటి పారుదల సరిగా లేకపోవడం వల్ల వర్షాలు వచ్చిన ప్రతిసారి కాలనీలు ముంపునకు గురి అవుతున్నాయని అన్నారు. అధికారులతో సర్వే చేయిం చామని, నివేదికలను ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. బాక్స్ డ్రైన్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా అధికారులు పనులను పరిశీలిస్తారని.. నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎండీపీ ఈఈ మాధవి, డీఈ సందీప్, ఏఈ వశిష్ఠ, జీహెచ్ఎంసీ ఏఈ మధురిమ, నాయకులు అమీనుద్దిన్, సత్తయ్య, భాగ్యానంద్ రావు, ఉస్మాన్, సంతోష్ నాయుడు, వంశీ, హబీబుద్దీన్, ఇబ్రహీం, జానకిరామ్, సంతోష్ గుప్త, నవాబ్, రాజు తదితరులు పాల్గొన్నారు.