Keesara | కీసర, మే 30 : ఎస్సీలంతా వారి హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్ అశోక్‌కుమార్ తెలిపారు. కీసర మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎస్సీల హక్కులు, విధుల గురించి తహసీల్దార్ వివరించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీలను ఎవరు బెదిరించిన వారి విలువలకు భంగం కలిగించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీలను ఎవరు ఇబ్బందులకు గురి చేసినా వారి మీద చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కీసరలోని హరిజనవాడ ప్రైమరీ స్కూల్ బోర్డుపై హరిజనవాడ అనే పేరును తొలగించాలని ఎస్సీలు తహసీల్దార్‌కు వివరించారు. ఈ విషయం మీద తహసీల్దార్ స్పందించి ఈ విషయాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని తెలిపారు.