మేడ్చల్ : ప్రగతే లక్ష్యం, సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ తీసుకువచ్చిన కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ది పొందిన ప్రతి నిరుపేద ఇంట్లో ఆనందం నెలకొందని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Mallareddy) అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ తహసీల్ కార్యాలయంలో, శామీర్‌పేట మండలంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటానని వెల్లడించారు. ప్రభుత్వం అందజేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.