Property Tax | దుండిగల్, మార్చి 29 : ఆస్తి పన్ను చెల్లింపుకు గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు ప్రజలపై ఒత్తిడి పెంచుతున్నారు. కరెంట్ కట్ చేస్తామని, నీటి సరఫరాను నిలిపివేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. అంతటితో ఆగకుండా ప్రత్యక్ష చర్యలకు దిగుతున్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15,16వ డివిజన్లలోని రాజీవ్ గాంధీ నగర్లో పలు ఇండ్లకు ఇవాళ స్థానికులు ప్రాపర్టీ టాక్స్ చెల్లించడం లేదంటూ ఏకంగా డ్రైనేజీ పైప్లైన్ మూసివేసారు. దీంతో స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీస వసతులను నిలిపివేస్తారా…?
రాజీవ్ గాంధీ నగర్లో ప్రజలందరూ, రోజువారి పనులు చేసుకుంటేనే జీవితం గడుస్తుందని, ఇప్పుడు కాకపోతే ఇంకో నాలుగు రోజులకైనా ఆస్తిపన్నులు చెల్లిస్తామని, కానీ ఇప్పుడే చెల్లించాలంటూ అధికారులు మురుగునీటి పైపులైను మూసి వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పన్నులు కట్టకుంటే ప్రజలకు అందాల్సిన కనీస వసతులను నిలిపివేస్తారా…? ఇదేం తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడి ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు స్పందించి వేసిన మురుగునీటి పైప్ లైన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబీర్ఆలీని వివరణ కోరగా… గడిచిన నెల రోజులుగా పనులు చెల్లించాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, ఆటోలను ఏర్పాటు చేసి ఇంటింటికి టాక్సులు చెల్లించాలని కోరుతున్నా ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ విధానం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..