Ramanthapur Division | రామంతాపూర్, మే 28 : రామంతాపూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నెలల తరబడి సాగుతున్న పనుల విషయంలో ఆయా కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామంతాపూర్ డివిజన్లోని మధురానగర్ నుండి వివేక్‌నగర్ వరకు ఇటీవలే 1కోటి రూపాయలు వరదనీటి కాలువ పనులకు(బాక్స్ డ్రైనేజీ కోసం) అధికారులు నిధులు మంజూరు చేశారు.
నెలల నుండి పనులు సాగుతూనే వున్నాయి. ఇండ్ల ముందు గుంతలు తవ్వడంతో ఇండ్ల నుండి బయటకు రావాలంటే కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి గుంతలలో నీరు నిండి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. డ్రైనేజీ కోసం తీసిన నాలాలో ద్విచక్ర వాహనాలు పడ్డాయి. నత్త నడకన సాగుతున్న ఈ పనులను పూర్తి చేయడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓపెన్ నాలా పై బాక్స్ డ్రైనేజీ పనులు ఎప్పడు పూర్తి చేస్తారో అధికారులు చెప్పడంలేదు. ఇప్పటికైనా ఇట్టి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మధురానగర్, వివేక్‌నగర్ ఈస్ట్ శ్రీనివాసపురం వాసులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఏఈ శ్వేత శ్రీని వివరణ కోరగా ఎలక్ట్రికల్ పోల్స్ అడ్డంగా ఉండడం, లేబర్ కొరత వలన ఆలస్యం జరుగుతుంది. వచ్చే వారం బాక్స్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు