MLA Bandari Laxma Reddy | మల్లాపూర్, మే 26 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఆయన మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి బాబా నగర్ దుర్గా నగర్, హనుమాన్ నగర్ కాలనీలో పర్యటించారు.
హిందూ ముస్లిం స్మశాన వాటిక, అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం కాలనీల్లో రోడ్ల సమస్యలపై కాలనీవాసులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నాల మహేందర్, జరిపోతుల భాస్కర్, భూపతి అశోక్, కందుల రాజు, దేవకుమార్, మూర్తి, ఎండి నయీమ్, జబ్బర్,రాజు గౌడ్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Nakirekal : తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాల విద్య : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Godavarikhani | కాళేశ్వరం పుష్కరాల సేవలో భ్రమరాంభిక సేవకులకు ప్రశంసలు