BRSV | ఢిల్లీ పెద్దలు దిగొచ్చేలా ఆమరణ నిరాహార దీక్ష.. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్
కేసీఆర్ 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదలతో పట్టు విడవకుండా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29 నాడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు అన్నారు..
BRSV |తెలంగాణ రాష్ట్ర సాధనకై అకుంఠిత దీక్ష, దృఢ సంకల్పంతో కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని స్మరించుకోవడం కోసం బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు తెలుగు విశ్వవిద్యాలయం (బాచుపల్లి)లో ఘనంగా దీక్షా దివస్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, ఇతర విద్యార్థి నాయకులు కేసీఆర్ చిత్రపటానికి, మరోవైపు అమరవీరుల స్తూపం చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి, విశ్వవిద్యాలయం అధ్యాపకులు బీవీఆర్ చారి ప్రారంభం ఉపన్యాసం ఇచ్చారు.
ఈ సందర్భంగా బీవీఆర్ చారి మాట్లాడుతూ.. కిషోర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి దీక్షా దివస్ పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారని.. ఆ దీక్ష ఫలితంతోనే నేడు తెలంగాణ స్వరాష్ట్రం సాధ్యమైందన్నారు. అదేవిధంగా కేసీఆర్ సలహా, సూచనల మేరకు స్వయంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఈ రాష్ట్రానికి అందించామని వారు గుర్తు చేసుకున్నారు.
ఆంధ్ర పాలకులు అడ్డంకులు సృష్టించినా..
మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ.. కేసీఆర్ 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదలతో పట్టు విడవకుండా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29 నాడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షా దివస్ కార్యక్రమం మొదటినుంచి ఉమ్మడి ఆంధ్ర పాలకులు అడ్డంకులు సృష్టించినా అకుంఠిత దీక్షతో పట్టు విడవకుండా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించడంతో, విద్యార్థి నాయకుల ఆత్మబలిదానంతో ఢిల్లీ పెద్దలు దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటనను చేశారని తెలిపారు. నాలాంటి విద్యార్థి నాయకులు లాఠీ దెబ్బలు లెక్కచేయకుండా ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచామని గుర్తు చేసుకున్నారు.
బీఆర్ఎస్వీ రాష్ట్రనాయకుడు నెమ్మాది శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం జరుపుకోవడం గర్వంగా ఉందని.. ఈ దీక్షా దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దూదిమెట్ల బాలరాజు యాదవ్‌కు అదేవిధంగా తెలంగాణ తల్లి రూపశిల్పి బీవీఆర్ చారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ కుత్బుల్లాపూర్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also :
Dalit Cook: దళిత మహిళను వంట చేయకుండా అడ్డుకున్న ఆరుగురికి జైలుశిక్ష
Deeksha Divas | తెలంగాణ భవన్లో దీక్షా దివస్.. దీక్షా దివస్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కేటీఆర్
Ditwa cyclone | దిత్వా తుఫాను ఎఫెక్ట్.. అల్లకల్లోలంగా సముద్రం.. Video
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

