ఉప్పల్, జూన్ 29 : నాచారం డివిజన్ లోని భూగర్భ డ్రైనేజీలు, మంచినీటి సమస్యలపై జలమండలి మేనేజర్ సిరాజ్‌తో వార్డు కార్యాలయంలో ఆదివారం నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో కొత్తగా మంజూరైన భూగర్భ డ్రైనేజీ పనులను తొందరగా ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.
అలాగే ఇంకా మంజూరు కానీ పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు సాయిజెన్ శేఖర్, విఠల్ యాదవ్, భూపాల్ రెడ్డి, కట్ట బుచ్చన్న గౌడ్, ఖాదర్, జలమండలి సూపర్వైజర్ శివ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.