చర్లపల్లి, సెప్టెంబర్ 14 : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకొవాలని హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ జేర్రిపోతుల ప్రభుదాస్ పేర్కొన్నారు. హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలోని బీకేనగర్లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్‌రెడ్డి, కాలనీవాసులతో కలిసి కార్పొరేటర్ ప్రభుదాస్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో విధిగా మొక్కలు నాటి కాలుష్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటుతున్న కాలనీలను ఆదర్శంగా తీసుకొని మిగత కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు వంజరీ ప్రవీణ్ కరిపే, నాయకులు చారి, బాలయ్యగౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.