Harish Rao | కుత్బుల్లాపూర్‌లో 22ఏ బాధితుల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద, మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీకి చెందిన విజయ్ అనే వ్యక్తి చెబుతున్నడు. 58 సంవత్సరాల కింద లే అవుట్ అయిందన్నా.. నేను సెకండ్ పర్చేజర్ను (కొనుగోలుదారు). గిప్పుడు తీసుకొనిపోయి దాన్ని 22ఏలో పెట్టుడు.. ఇదేం పిచ్చితనం.. ఇదేం తుగ్లక్ చర్య అని చెప్తున్నడని అన్నారు.
చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు రూ.30 వేలు, ఫ్లాటుకు రూ.30 వేలు ఆ పైసలు తీసుకుపోతనే గవర్నమెంట్లో పని అయితది.. ఏజెంట్లు తిరుగుతున్నరన్నా అని చెప్తున్నడు. అంటే 22ఏలో పెట్టుడు ముఖ్యమంత్రి, పొంగులేటి ఏజెంట్లు ఇవాళ కాలనీల మీద, గ్రామాల మీద పడి తిరుగుతున్నరు. మీరు డబ్బులు ఇయ్యండి.. 22ఏలో నుంచి తీసేస్తమంటురన్నాడని హరీశ్ రావు తెలిపారు.
నిన్న ఒకాయన తెలంగాణ భవన్‌కు వచ్చిండు.. అమీన్పూర్ అనుకుంటా..మా భూమి ఎందుకు 22ఏలో పెట్టిర్రు అని ఎమ్మార్వో దగ్గరకు పోయిండట. మాకు తెల్వదు.. ఆర్డీవోను పోయి అడుగుపో అన్నడట. ఆర్డీవో దగ్గరకు పోతే పోయి కలెక్టర్‌ను అడుగుపో అన్నడట. ఇది నేను కాదు.. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. గవర్నమెంట్‌ను అడుగుపో అన్నడట. బయటకు వచ్చినంక ఓ బ్రోకర్ కలిసిండట. చూడు బై వట్టిగా తీసేస్తరా..? బర్రె పాలు ఉత్తగనే ఇస్తదా.. సొప్ప వేస్తేనే పాలు ఇస్తది. గదేందో చూసుకోపో అంటుండట. ఈ 22ఏ వెనుకున్న కథేందంటే కమీషన్లు దొబ్బుడని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా..? ఇవాళ ఆస్తుల విలువ పడిపోయి.. ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా.. అన్నారు. దీనిపై ఎంక్వైరీ జరగాలా.. వద్దా..? అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టామంటున్నారు. మర్యాద కొద్దీ తీసి.. తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతరు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చస్తరు జాగ్రత్త అని హెచ్చరించారు.
ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు
ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి
ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?
ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో… https://t.co/DMYPs9FjZF pic.twitter.com/5crDAlPdRJ
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026
LIVE: కుత్బుల్లాపూర్ లో 22ఏ బాధితుల సమావేశం@BRSHarish https://t.co/YHqhwDaWoC
— BRS Party (@BRSparty) August 25, 2026
East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు
Konda Surekha | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!