East Coast | ఈస్ట్ కోస్ట్ రైల్వే 1599 యాక్ట్ అప్రెంటిస్ (Act Apprentice) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలచేసింది. వీటి దరఖాస్తు ప్రక్రియ రేపటి (ఆగస్టు 26) నుంచే ప్రారంభమవుతుంది. వీటికి ఆన్లైన్లో సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లు, వర్క్‌షాప్‌లో 2026-27 సంవత్సరానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే కోరుతుంది.
విభాగాలు
ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ (Machinist), ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), సెక్రటేరియల్ అసిస్టెంట్ (స్టెనోగ్రఫీ), బ్లాక్ స్మిత్, డ్రిల్లర్, బ్రిడ్జ్ ఎరెక్టర్, షీట్ మెటల్ వర్కర్, గైండర్, వైర్మన్, ఎలక్ట్రానిక్స్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ల్యాబొరేటర్ టెక్నీషియన్ (పాథాలజీ) తదితర విభాగాల్లో ఈ 1599 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు.

East Coast Railway
అర్హతలు
గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్యులేషన్ (పదో తరగతి)/ఇంటర్ ఉతీర్ణులై ఉండాలి. టెక్నికల్ అర్హతల్లో సంబంధిత ట్రేడ్‌లో ఎన్సీవీటీ/ఎస్సీవీటీ (NCVT/SCVT) ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్ తేదీ నాటికి ఎస్ఎస్సీ లేదా ఐటీఐ ఫలితాలు వెలువడనివారు అర్హులు. వయసు 15 నుంచి 24 ఏండ్లలోపు ఉండాలి. ఈ వయసును సెప్టెంబర్ 15 నాటికి లెక్కిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, పీడబ్ల్యూడీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించరు. మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులకు సంబంధించిన మార్కులను పరిశీలిస్తారు. వీటిలో మెరిట్ (Merit) ఆధారంగా జాబితాను రూపొందించి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 15లోగా సమర్పించాలి. ఇతర వివరాలు వెబ్సైట్ www.rrcbbs.org.inలో చూడండి.