Konda Surekha : మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్ అయ్యారు. ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో అలసత్వంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితుడు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు విషయంలో జాప్యం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ CI ముత్తు యాదవ్‌పై చర్యలు తీసుకున్నారు. కాగా సస్పెండైన జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ మూడు వారాల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు.
పోలీసుల నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్ హాట్ టాపిక్ అయింది. కాగా సురేఖ మాజీ OSD సుమంత్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. సుమంత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం ఎదుట డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశారనే ఆరోపణలపై సుమంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు, కేసులో భాగంగా డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుమంత్ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.