మల్కాజిగిరి ఏప్రిల్ 24 : హైదరాబాద్లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని గద్దర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సీఎల్ యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రజా సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ స్త్రీల పరువు తీసే అందాల పోటీలను బహిష్కరిచాలని అన్నారు.
మహిళలను విలాస వస్తువుగా దిగజార్చే అందాల పోటీలను నిర్వహించొద్దన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని, వ్య క్తిత్వాన్ని, భంగపరిచే అందాల పోటీలను రద్దు చేయాలని అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, గద్దర్ అభిమానుల సంఘం, జజ్జనక కళా మండలి, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయని యాదగిరి అన్నారు.