మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 12 : కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ మండల కార్యదర్శి నర్సింగ్‌రావు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, వారంతరపు సెలవులు అమలు చేయాలని అన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షలు అందించాలని, దహన సంస్కారాలకు రూ.30 వేలు అందించాలని కోరారు. కార్మికులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, కార్మికులు లలిత, జాన్ మోష, మైసయ్య, మనెమ్మ, నీరజ, లక్ష్మి, నరసమ్మ, బాలమణి, అశ్విని, మైసయ్య, అరుణ, తదితరులు పాల్గొన్నారు.