శామీర్పేట, జూలై 3 : సామజిక భద్రత మనందరి బాధ్యతని శామీర్పేట సీఐ శ్రీనాథ్ అన్నారు. మూడు చింతలపల్లి మున్సిపల్ లక్ష్మాపూర్ శివాలయంలో ఏర్పాటు చేసిన సీసీ రెమెరాలను గురువారం సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలపై అవగాహన సదస్సు స్ఫూర్తిగా తీసుకున్న శివాలయం కమిటీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. గ్రామంలో పర్యవేక్షణ లోపం వలన పాడై పోయిన 30 సీసీ కెమెరాలను తమ సొంత నిధులతో బాగుచేయించుకోవడానికి ప్రజలు ముందుకు రావడం ఇతర గ్రామాలకు స్ఫూ్ర్తిదాయకం అన్నారు.
ఇదే స్పూర్తితో ముందుకు నడుస్తే సామజిక భద్రత సంకల్పం నెరవేరుతుందని, భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలను ఇదే విధంగా గ్రామ పెద్దలు ముందుండి నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సోమిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ నర్సింలు యాదవ్, శివాలయం చైర్మన్ వీరేశం, మాజీ ఎంపీటీసీ నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.