నాచారం, డిసెంబర్19: సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ సూచించారు. సైబర్ నేరాల పై ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాఫ్’ పేరుతో నాచారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అకడమిక్ హైట్స్ పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..సాంకేతిక పరిజ్ఞానం పేరిగే కొద్ది సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరాల పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ముఖ్యంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్, టాస్క్ బేస్డ్ బిజినెస్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, మొదలైన వాటిపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థుల చేత సైబర్ క్రైమ్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. సైబార్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచచారం ఎస్ఐలు ఎస్ కె మైబెల్లి, ఇతర పోలీస్ సిబ్బంది, అకడమిక్ హైట్స్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.