వినాయక్‌నగర్, మే 20 : ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మల్కాజిగిరి నియోజక వర్గ మాజీ ఇన్చార్జి బద్దం పరశురాం రెడ్డి అన్నారు. బుధవారం వినాయక్‌నగర్ డివిజన్ సూర్యనగర్‌లో ఆశా వర్కర్ల సౌకర్యం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు టేబుల్స్, కుర్చీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సురేష్, బాలకృష్ణగుప్త, ఫరీద్, కరీం, సాంబరాజు, రమేష్, అరుణ, ఆశా వర్కర్లు యమున, అనిత తదితరులు పాల్గొన్నారు.