జీడిమెట్ల, జూలై 17 : బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహ్మద్ రఫీ అన్నారు. చింతల్ డివిజన్ పరిధి రొడామేస్త్రీనగర్లో గురువారం నీటి సరఫరా చేసే సమయంలో జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ సమీర్ లైన్ మెన్ గంగాధర్ తో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ నీటి సమస్యను పరిశీలించారు.
ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బస్వరాజు, నసీర్, సుల్తానా బేగం, ఖాసీం, అబ్దుల్ కరీం, ఖలీల్, మజీద్, నయీమ్, షబ్బీర్, తహర్, నిజాం, సలుద్దీన్, ఇంతియాజ్, ఇఫ్తేకర్, యూసఫ్, మూసా, నజీర్, శామీమ్ బేగం, శరణప్ప తదితరులు పాల్గొన్నారు.