జీడిమెట్ల , ఏప్రిల్ 11 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సుభాష్‌నగర్ డివిజన్ పరిధి సూరారం బస్టాప్ వెనుక భాగంలో భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్‌కు లీకేజీ తలెత్తడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోమవారం సూరారం చౌరస్తా సమీపంలో ఉన్న బస్టాప్ వద్ద పూట్పాత్ల నిర్మాణంలో భాగంగా జేసీబీ సహయంతో గోతులు తవ్వుతుండగా భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్‌కు జేసీబీ తగలడంతో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ లీక్ కావడంతో అసలే ఎండకాలం ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానిక ప్రజలు పరుగులు తీశారు. గంటన్నర అనంతరం భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది ఘటన స్థలానికి చెరుకుని మరమ్మతులు చేపట్టడంతో ప్రజలు ఊపిరీ పీల్చుకున్నారు.