హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నిక ల్లో అధికారంలో ఉన్న పార్టీ హవా కొనసాగుతుంది. గతంలో బీఆర్ఎస్ కూడా అధిక స్థా నాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. కానీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇందుకు విరుద్ధమైన ఫలితాలు కనిపించాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచిందని, అత్యధిక స్థానాలు గెలుచుకోవడంలో విఫలమైందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. సంఖ్యాపరంగా ఎక్కువ మున్సిపాల్టీలు గెలిచినట్టు కనిపించినా.. పార్టీని ఆశించిన స్థాయి లో ప్రజలు చేరదీయలేదని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనేలా పోటీపడ్డారని అంటున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ ప్రతిఘట<a110 మున్సిపాల్టీలను, 9 కార్పొరేషన్లను కైవసం చేసుకున్నదని, ఐదు ఉమ్మడి జిల్లాలను బీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆదరణను పొందలేకపోయిందని అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సీఎం రేవంత్‌రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించారు. మిర్యాలగూడ, భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్, వికారాబాద్ జిల్లా పరిగి, నిజామాబాద్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచా రం సాగించారు. ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎకడికకడ నియోజకవర్గాల్లో మోహరించారు. అధికార పార్టీ నేతలు ఓటర్లను అనేకవిధాలుగా ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన నేతలపై దాడులకు దిగారు. అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించారు.
అయినా పట్టణ ప్రజల అభిమానాన్ని పొందలేకపోవటంపై కాంగ్రెస్ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ముఖ్యమంత్రి కాళ్లకు బలపం కట్టుకొని తిరిగిన ప్రాం తాల్లోనూ రెండు మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మేజర్ ప్రాంతాల్లో హంగ్ వచ్చినట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సొం త జిల్లా నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చావుతప్పి కన్ను లొట్టపోయిన తీరు ఫలితాలే వచ్చాయని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.
మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూ ర్, ఆయన ఇన్చార్జ్గా ఉన్న మెదక్ పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయం పొందిం ది. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచింది. కొత్తగూడెంలో పొంగులేటి కారణంగా సీపీఐతో పొత్తు కుదరకపోవటంతో సీపీఐ ఒంటరిగా నిలబడి సత్తా చాటింది. వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్గా పొంగులేటి ప్రచారం చేసిన తొర్రూరు, వర్ధన్నపేట, జనగామలో కాంగ్రెస్ ఓటమిపాలు కావటంపై ఆ పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ప్రతిసారి ఓట్లను డబ్బుతోనే కొనాలనుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సొంత మండలం కేసముద్రం మున్సిపాలిటీలోనూ హంగ్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
