హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో అత్తెసరు ఓట్లతో కాంగ్రెస్ గట్టెక్కింది. బొటాబోటి స్థానాలతో మున్సిపాల్టీలను కైవసం చేసుకున్నది. 116 మున్సిపాల్టీల్లో 66స్థానాల్లో గెలుపొందింది. అందులో 8మున్సిపాల్టీల్లో మ్యాజిక్ ఫిగర్ మాత్రమే సాధించి దక్కించుకోవడం గమనార్హం.
18చోట్లా మ్యాజిక్ఫిగర్ కంటే ఒక స్థానాన్ని అదనంగా సాధించింది. నికరంగా చూస్తే కాంగ్రెస్ కేవలం 40మున్సిపాల్టీల్లోనే స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది.
