మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy ) తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారం, రాంపల్లిదాయర, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన యువకులు (Youth) ఆదివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ గ్రామాల నుంచి యువకులు బీఆర్ఎస్ చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. పార్టీకి యువకులు కీలకమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ( CM KCR ) అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పనిచేసేందుకు కార్యకర్తలు కూడా దొరకరని అన్నారు. ఈ కార్యక్రమంలో కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్‌శర్మ, బీఆర్ఎస్ యూత్ నాయకులు తటాకం భానుశర్మ, పార్టీ నాయకులు కందాడి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేశ్‌గుప్తా పలువురు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన యూత్ నాయకులు
రమణప్రతాప్రెడ్డి, చిట్టి అరవింద్ యాదవ్, రాహుల్, కందాడి కార్తీక్‌రెడ్డి, నిఖిల్‌గౌడ్, నాగేశ్‌నాయక్, ముత్తుస్వామి, వినోద్, మంద విజయభాస్కర్, గొలుసు సాయి, సాయిగౌడ్, ఎం. దిలీప్‌కుమార్, ఎం. నవీన్‌కుమార్, సీఎచ్ సాయికృష్ణ, ఎస్. గణేశ్, ఎం. హరీష్, కెఎల్ రాహుల్ బీఆర్ఎస్లో చేరారు.