Athletics Competetions | శామీర్పేట, మే 25 : శామీర్పేట తెలంగాణ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఇవాళ జరిగాయి. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 8, 10, 12 ఏండ్లలోపు బాల బాలికలు పాల్గొని పరుగు పందెం, షాట్ పుట్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్ తదితర పోటీల్లో తలపడ్డారు. ఈ సందర్భంగా కూరపాటి రాజశేఖర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జూన్ మొదటి తారీఖు హైదరాబాద్లో జరిగే 14వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, జాయింట్ సెక్రెటరీ దయాళ్, టెక్నికల్ కమిటీ సభ్యుడు తిరుమల రావు, వివిధ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.