Mahankali Temple | శామీర్ పేట్, మార్చి 19 : కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మహంకాళి ఆలయం తాళం, హుండీ విరగొట్టారు. అనంతరం ఆ హుండీలోని డబ్బులు అపంహరించుకుపోయిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
శామీర్ పేట్ మండలం అలియాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో చొరబడి హుండీని గుడి బయటకి తీసుకెళ్లి పగలగొట్టారు. అందులోని డబ్బులను ఆపహరించుకుపోయారు. ఆలయం తలుపుల తాళం విరగొట్టి చిన్న చిన్న వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.