Anurag University | పోచారం, మే5 : అనురాగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.రామారెడ్డి (83) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నీలిమా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
రామారెడ్డి అనురాగ్ యూనివర్సిటీకి ట్రస్టీగా ఉన్నారు. అన్నోజిగూడలోని సంస్కృతి టౌన్షిప్లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, రామారెడ్డి మరణంపై అనురాగ్ యూనివర్సిటీ అధినేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యవక్తంచేశారు. సంస్కృతి టౌన్షిప్లోని నివాసానికి వెళ్లి రామారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి ఓదార్చారు.