Sabiha Begum | అల్లాపూర్, జూన్ 14 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.కోట్లు నిధులు వెచ్చించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కార్పొరేటర్ సబిహా బేగం అన్నారు. శనివారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్లో జరుగుతున్న నాలా అభివృద్ధి పనులను కార్పొరేటర్ సబిహా బేగం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ సబిహా బేగం మాట్లాడుతూ.. గతంలో చిన్నపాటి వర్షానికి నాలా పొంగి పరివాహ ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లలోకి వరద నీరు ముంచెత్తేదని, దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబోసారన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న దశాబ్ధాల ముంపు సమస్యను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించి శాశ్వత పరిష్కారం చూపారన్నారు.
రామారావు నగర్ నుంచి బబ్బుగూడ వరకు 1200 మీటర్ల పొడవు, నాలాకు ఇరు వైపులా ఐదు మీటర్ల వెడల్పుతో ఆర్సీసీ వాల్ నిర్మాణం, పైన స్లాబ్ వేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఇక మిగిలిన నాలా విస్తరణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్