చర్లపల్లి, అక్టోబర్ 21 : చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడలో విద్యుత్ సమస్యలను అధిగమించేం దుకు చర్యలు తీసుకుంటున్నామని కుషాయిగూడ విద్యుత్ ఏఈ రామకృష్ణ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని కుషాయిగూడ, పారిశ్రామికవాడలో కుషాయిగూడ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు మేరకు విద్యుత్ సమస్యలను పరిశీలించి చెట్ల కొమ్మలను సిబ్బందితో కలిసి తొలగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుషాయిగూడ, పారిశ్రామికవాడలో విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ అధ్యక్షుడు ఎంపెల్లి పద్మారెడ్డి, కుషాయిగూడ సంక్షేమ సంఘం ప్రతినిధులు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.