TB control | కేపీహెచ్బీ కాలనీ, జూన్ 25: క్షయ( టీబీ )నిర్మూలనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి శ్రీదేవి అన్నారు. టీబీముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కూకట్పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీలో టీబీగుర్తింపు పరీక్షలను నిర్వహించి.. ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సమాజాన్ని టీబీ రహితంగా మార్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే నిరంతర దగ్గు, దగ్గినప్పుడు రక్తం లేదా స్లేహం రావడం, శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు చాతినొప్పి రావడం, బరువు తగ్గడం, అలసట, బలహీనత, జ్వరం, రాత్రి వేళలో చెమటలు రావడం, ఆకలి వేయడం, శ్వాస ఆడక పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టీబీ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముందస్తుగా టీబీని గుర్తించడం వల్ల సకాలంలో చికిత్స పొందవచ్చునని.. తద్వారా టీబీని సమూలంగా నియంత్రించవచ్చని తెలిపారు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని… ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజు 153 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మమత సూపర్వైజర్ మోహన్, రామకృష్ణ, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ