కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 1: కూకట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. కాలేజీ ప్రాంగణంలో టీఎస్కేసీ, కి టెక్ సాఫ్ట్వేర్ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 75 మంది విద్యార్థులు పాల్గొనగా.. 72 మంది ఉద్యోగాలు పొందారు. జాబ్లకు ఎంపికైన విద్యార్థులు రూ.5.2 లక్షల చొప్పున వార్షిక వేతనం అందుకోనున్నారు.
తమ కాలేజీ విద్యార్థులు చక్కటి వేతనాలతో ఉద్యోగాలకు ఎంపిక కావడం సంతోషకరమని ప్రిన్సిపల్ అలివేలు మంగమ్మ తెలిపారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్కేసీ కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, కన్వీనర్ నాగార్జున, గణేశ్, అశ్విన్ కుమార్ తదితరులు ఉన్నారు.