హైదరాబాద్ : కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం 136 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధులు, స్థానిక దాతలు ఇందుకు సహకరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో కలుపుకుని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 523 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, నేను సైతం కార్యక్రమం కింద 3,692 కెమెరాలు ఏర్పాటు అయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పర్యవేక్షణలో సీసీటీవీ కెమెరాలు ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. పౌరులు, స్థానిక ప్రజలు ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో ఇప్పటివరకు 1.25 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసుల త్వరితగతిన పరిష్కారానికి సీసీ టీవీ కెమెరాలు ఎంతగానో సహాయపడుతాయన్నారు.
సీసీ కెమెరాలఏర్పాటుకు సహకరించిన దాతలకు సన్మానం చేయడం జరిగింది.
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) April 9, 2021
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ వెంకటేష్ గారు, ఎంపీపీ ఇందిరా గారు, పోలీస్ అధికారులు, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/Zq9yfccce0