చేవెళ్లటౌన్, జూలై 14 : ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డ జిల్లా చేవెళ్ల మండలంలోని రేగడి ఘనపూర్, రామన్నగూడ గ్రాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు ఎస్ఎఫ్ఐ నుంచి సోమవారం పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, దేవరంపల్లి మాజీ సర్పంచ్ నరహరి రెడ్డి అధ్వర్యంలో 200 మందికి పైగా ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేశారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల వలే పనిచేయాలని సూచించారు. తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆలుపెరగని పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు చేతకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వనికి ప్రజలు తొందరలోనే తగిన బుద్దిచెబుతారన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని అవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్,బీజేపీ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయిందని స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సరికి ఇంకా భారీ ఎత్తున వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్లో పార్టీలోకి చేరుతారని తెలిపారు. పార్టీని నమ్ముకున్న వారికి పార్టీ ఎప్పుడు అన్యాయం చేయదని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేశమొల్ల అంజనేయులు, మాజీ సర్పంచ్లు వనం మహేందర్ రెడ్డి, శేరి శివారెడ్డి, అంజన్గౌడ్, మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ నర్సిములు, డైరెక్టర్లు కృష్ణా, వెంకటేష్, నాయకులు ఇమ్రాన్, మాణిక్య రెడ్డి, మాధవ రెడ్డి, మహేందర్, మాణిక్యం, తదితరులు ఉన్నారు.