బడంగ్‌పేట, అక్టోబర్ 25 : మోసాలకు కాం గ్రెస్ పార్టీ కేరాఫ్ అని.. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో దానిని నమ్మే పరిస్థితు ల్లో ప్రజలు లేరని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కర్రొల్ల చంద్రయ్య ముదిరాజ్, మాగంటి నవీన్ ఆధ్వర్యంలో మహేశ్వరం పద్మశాలీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దమ్మ, పెంటయ్య, పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి కౌకుట్ల శ్రీనివాస్ తదితరులు మహేశ్వరం మండలకేంద్రంలో శనివారం సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా.. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పా ర్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు. గ్రామస్థా యి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొద లైందన్నారు. ప్రజలు మళ్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న ఆమె.. రాబోయేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకలు కృష్ణ యాదవ్, నాగేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.