అమనగల్లు, ఫిబ్రవరి9: క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేశ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు జరగనున్న మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను స్థానిక నాయకులు, నిర్వాహకులతో కలిసి వగ్గు మహేశ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వగ్గు మహేశ్ మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలను క్రీడాకారులు వేదికగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహించడం పట్ల నిర్వహకులను అభినందించారు. వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటున్న 10 టీమ్‌లకు తన సొంత డబ్బులతో టీషర్ట్స్‌ను వగ్గు మహేశ్ సమకూర్చారు. దీంతో వగ్గు మహేశ్‌తో పాటు మొదటి బహుమతి అందజేస్తున్న పాపిశెట్టి రాము, పవన్.. రెండో బహుమతి అందజేస్తున్న కోరె మహేందర్.. షీల్డ్ నెట్, క్రీడా సామగ్రిని సమకూర్చిన ఎనుమల్ల రమేశ్.. ఫుడ్ అరెంజ్ చేసిన వారిని నిర్వాహకులు అభినందించారు. శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పగిడిపాల పాండు, ఫ్యాక్స్ సీఈవో గోరటి దేవేందర్, నిర్వాహకులు లండం జగన్, మనోహర్ రెడ్డి, కోరే రవి, రాజు, పవన్, సురేశ్, చాంద్ పాషా, గుజ్జరి గోపి, చలిచీమల సందీప్, స్థానిక నాయకులు మల్లేపోగు మల్లేశ్, కొమ్ము ప్రసాద్, చలిచీమల సతీశ్, హఫీజ్, శేఖర్, ఉపాధ్యాయులు దూసకంటి శ్రీధర్, కృష్ణయ్య ఉన్నారు.