ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 23 : గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డిజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్‌రెడ్డి సహకారంతో నాయిని వెంకటేశ్వర్‌రెడ్డి ఫౌండేషన్ ప్రత్యేక చొ,వతో గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు కంటి సమస్యలతో పాటు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించటం అభినందనీయమని ప్రతాప్‌రెడ్డితో పాటు నాయిని వెంకటేశ్వర్‌రెడ్డి ఫౌండేషన్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీపీ కృపేష్, బీఆర్ఎస్ నాయకులు బుట్టి చంటి, నర్సింహ, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.