రంగారెడ్డి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : వరంగల్‌లో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఇంటికో జెండా.. ఊరికో బండి తో భారీగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన పార్టీ రజతోత్సవ మహాసభ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రజతోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు భారీగా తరలిరావాలన్నారు. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మం డిపడ్డారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆశవర్కర్లు, అంగన్వాడీలను అధోగతి పాలు చేసిందన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మం త్రి పదవిపై ధ్యాసే తప్పా.. ప్రజలు, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకునే సోయిలేదని..మంత్రి పదవి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గాలిమాటలు చెప్పడం కాదు.. దమ్ముంటే రాజీనామా చేయాలని మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మంత్రి పదవి కోసం ఆయన ఢిల్లీ చుట్టూ తిరుగుతూ 16 నెలలుగా ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ హ యాంలో జరిగిన అభివృద్ధి పనులే తప్పా.. కాంగ్రెస్ హయాంలో ఒక్క రూపాయి కూడా విడుదల చేసి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేని మల్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం నియోజకవర్గ ప్రజల దురదృష్టమన్నారు. ఎన్నికల ముందు కోట్లాది రూపాయల ప్రొసీడింగ్‌లను బీఆర్ఎస్ ప్రభు త్వం అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తే అవి ఈ ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. 16 నెలల్లో ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షు డు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దండెం రాంరెడ్డి, జక్క రాం రెడ్డి, ఏర్పుల చంద్రయ్య, కృపేశ్, బలరాం, ఆకుల యాదగిరి, బియ్యని జ్ఞానేశ్వర్, అల్వాల వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్య, పాశం దామోదర్, కల్యాణ్‌నాయక్, బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, కిషన్‌గౌడ్, రమేశ్, రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, యాదయ్య, వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, భరత్‌కుమార్, భరత్‌రెడ్డి, జెర్కోని రాజు, జగదీష్, శివసాయి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొడంగల్, ఏప్రిల్ 18 : ఈ నెల 27న వరంగల్‌లో జరిగే మహాసభకు దండులా తరలివెళ్లి సక్సెస్ చేద్దామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకు డు మధుసూదన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పండుగను అంబరాన్నంటేలా ఘనంగా నిర్వహించుకుందామన్నారు. అందుకోసం నియోజకవర్గం లోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు. పోరాడి రాష్ర్టా న్ని సాధించిన కేసీఆర్.. పదేండ్ల కాలంలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ఆయన పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. వరంగల్ సభకు తరలివెళ్లేందుకు 15 బస్సులు, 150 ప్రైవేట్ వాహనాలు, బీఆర్ఎస్ శ్రేణుల సొం త వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి చలో వరంగల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డల పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌రావు యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రమేశ్‌బాబు, కోట్ల యాదగిరి, నారాయణరెడ్డి, చాంద్‌పాషా, బాల్‌రాజ్, నర్మదాకిష్టప్ప, అబ్దుల్ వాహబ్, ముక్తార్, నవాజోద్దిన్, లగచర్ల సురేశ్, భీములు, దత్తురెడ్డి, రాములు, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గత 15 ఏండ్లుగా అభివృద్ధిలో ముందున్నది. 16 నెలల కిందట ఈ ప్రాంతం ఓ వ్యక్తి చేతిలోకి వెళ్లిందో అప్పటి నుంచి అభివృద్ధిలో వెనుకబడింది. ఈ ప్రాంత అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నాడు. 16 నెలలుగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధికీ రూపాయి కేటాయించకుండా…తట్టెడు మట్టి పోయకుండా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు.
-క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 18 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభ ను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు భారీగా తరలిరావాలని పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పట్లోళ్ల కార్తిక్‌రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం అత్తాపూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ప్రణాళికతో ముందు కు సాగాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి రానున్న ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా కష్టపడి పని చేయాలన్నారు.