Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Miss behave | వీరముష్టి నరేష్ (45) అనే వ్యక్తి బొమ్మలు ఇస్తానని చెప్పి చిన్నారులను తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిని బలవంతంగా పట్టుకుని, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు.
Miss behave | చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీలో చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 4వ తేదీన ఉదయం చిన్నారి తల్లిదండ్రులు పనికి వెళ్లగా, చిన్నారి ఇంటి వద్ద తన తమ్ముడితో కలిసి ఉంది. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో అదే కాలనీకి చెందిన కూలి పని చేసుకునే వీరముష్టి నరేష్ (45) అనే వ్యక్తి బొమ్మలు ఇస్తానని చెప్పి చిన్నారులను తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిని బలవంతంగా పట్టుకుని, ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో చిన్నారి ప్రతిఘటించడంతో, అదే భవనంలోని పై అంతస్తులో ఉన్న ఒక మహిళ గమనించి నిందితుడిని మందలించింది. దీంతో అతను చిన్నారిని వదిలిపెట్టగా.. చిన్నారులు అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన అనంతరం చిన్నారి జరిగిన విషయాన్ని వారికి వివరించింది. దీంతో బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిన్నారుల భద్రత పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా వదిలే పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే నరేందర్ రెడ్డి సూచించారు.
Read Also :
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్
Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మారంలో షుగర్ నిర్దారణ పరీక్షలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
AP News | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

