బంట్వారం(కోట్పల్లి), ఆగస్టు 28 : భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం కోట్పల్లి వాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి భార్య ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోట్పల్లి గ్రామానికి చెందిన చాకలి సంగమేశ్వర్ బుధవారం మధ్యాహ్నం వాగులోకి వెళ్లి గల్లంతయ్యాడు.
ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతడి భార్య లక్ష్మి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు హుటాహుటిన గాలింపు చర్యలను చేపట్టారు. గురువారం కూడా రెండు బోట్లలో ఎనిమిది మంది గజ ఈతగాళ్లతో సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా అతడి ఆచూకీ లభ్యం కాలేదని ఎస్ఐ శైలజ తెలిపారు.