బడంగ్ పెట్, మార్చ్ 16 : ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడు మోసం(Cheating girl) చేసిన సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన పూర్ణేశ్వర్ రెడ్డి అలియాస్ లడ్డు అనే యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మీర్ పేట్ కు చెందిన ఓ అమ్మాయితో పరిచయమై ప్రేమగా మారింది. ఆమెను లోబర్చుకోవడానికి అనేక విధాల అమ్మాయిని ఒప్పించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మకం కలిగించాడు.
శారీరకంగా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్తూ వస్తుంటే దాటవేస్తూ తప్పించుకుంటున్నాడు. చివరకు పెళ్లి చేసుకోవడానికి తక్కువ కులం అడ్డు వస్తుందని పూర్ణేశ్వర్ రెడ్డి అలియాస్ లడ్డు అనడంతో బాధితురాలు మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పూర్ణేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని సీఐ నాగరాజు తెలిపారు.