కొడంగల్, ఫిబ్రవరి 15 : ఈనెల 17న మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్, వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మున్సిపల్ కేంద్రంలో గ్రీన్ ఇండియా చాలెంజ్, వృక్షార్చన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
కేసీఆర్ పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సక్సెస్ చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, మహిపాల్, విష్ణువర్ధన్‌రెడ్డి, భీములు, నరేశ్, సోమనాథ్, రవిగౌడ్, మల్లేశ్, పాల్గొన్నారు.