కందుకూరు, డిసెంబర్ 6 : ప్రజలకు అందుబాటులో ఉం టానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం పలు వురు నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. తనపై నమ్మకం ఉంచి ఎంతో నమ్మకంతో కష్టపడి గెలిపించిన వారందరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారిస్తానని తెలిపారు.
ఎమ్మె ల్యేను కలిసిన వారిలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్య క్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి. యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్‌రెడ్డి, కాసోజు ప్రశాంత్ చారి, ఎగ్గిడి గణేశ్, రామకృష్ణ, శ్యామ్ బాబు, అగర్మియాగూడ మా జీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మం డల ఉపాధ్యక్షుడు సామ మహేందర్‌రెడ్డి, సామ సురేందర్ రెడ్డి, దేవీలాల్, అంజిరెడ్డి, జంగారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వెంక ట్‌రెడ్డి, రవీందర్. హబీబ్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
వికారాబాద్ : మాజీ మంత్రి, మహేశ్వరంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితారెడ్డిని బుధవారం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు వడ్ల నందు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.