వికారాబాద్, అక్టోబర్ 4: బతుకమ్మ వేడుకలతో ఈ ప్రాంత సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచానికి చాటిన ఘనత రాష్ట్ర ప్రభుత్వనిదేనని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో 2.73 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వికారాబా ద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి ఆయన మహిళ లకు బతుకమ్మ చీరలు, గ్రామీణ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నా రు. జిల్లాలో క్రీడా ప్రాంగణాలు పూర్తైన 574 గ్రామ పంచాయతీలు, పలు వార్డులతో కలిపి రూ.3.13కోట్లతో 626 యూనిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 18 వేల గ్రామ పంచాయతీలకు రూ.100 కోట్లతో క్రీడా పరికరాలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, మున్సిపల్ చైర్పర్సన్ మం జుల, డీఆర్డీవో కృష్ణన్, ఆర్డీవో విజయకుమారి, హనుమంతరావు, డీఈవో రేణుకాదేవి, మెప్మా పీడీ రవికుమార్, అమరేంద్రకృష్ణ, ఎంపీడీవో సత్తయ్య, నాగరాజు తదితరు లు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : షాద్‌నగర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవనం, వర్క్‌షాప్, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 6.20 కోట్లు విడుదల చే స్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1996లో ఏర్పాటైన ఈ కళాశాలకు ఇప్పటి వర కు పక్కా భవనంలేదు. దీంతో భవనంతోపాటు వర్క్‌షాప్, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్లు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీ కుముదిని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.