ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధి శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. రాచకొండ లో వెలిసిన స్వయంభు శివలింగేశ్వర స్వామికి భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లోని శివాలయాలు మహాశివరాత్రి సందర్భంగా శివనామస్మరణలతో మార్మోగాయి.
దండు మైలారంలోని పురాతన శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచాల మండలంలోని నోముల మల్లికార్జున స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాలు శివనామస్వాములతో మారుమోగాయి. అలాగే, మండలం కప్పాడు గ్రామంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిత్య జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.