Bus- Lorry | షాద్‌నగర్ టౌన్, ఫిబ్రవరి 14 : షాద్ నగర్ పట్టణం పరిగి రోడ్డులో గల పోచమ్మ దేవాలయం వద్ద గురువారం యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు పరిగి రోడ్డులో యూటర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో పరిగి రోడ్డు నుంచి షాద్ నగర్‌కు వేగంగా వస్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్టు తెలిపారు. వెంటనే స్థానికులు గాయపడిన వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇదిలా ఉంటే లారీ అతివేగంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు.