రంగారెడ్డి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మూ డు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, శంషాబాద్ మండలాల్లోని 174 గ్రామపంచాయతీలు, 1,530 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు 1,530 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రెండో విడతలో శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి మండలాల్లోని 173 గ్రామపంచాయతీలు, 1,540 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఇందుకోసం 1,540 బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. మూడో విడతలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచా ల, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని 174 గ్రామపంచాయతీలు, 1590 వార్డులకు ఎన్నికలు జరగకుండగా.. 1,612 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 526 గ్రామపంచాయతీలు, 4,668 వార్డులకు జరుగనున్న ఎన్నికల కోసం 4,682 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులున్నాయి. ఎన్నికల కోసం అధికారులు 5,058 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, మొదటి విడత (డిసెంబర్ 11న) తాండూరు, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లోని 262 పంచాయతీలు, 2,198 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు 2,198 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. రెండో విడతలో వికారాబాద్, ధారూరు, మోమిన్‌పేట, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 పంచా యతీలు, 1520 వార్డులకు ఎలక్షన్ జరుగనున్నాయి. మూడోవిడతలో పరిగి, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్, దోమ మండలాల్లోని 157 పంచాయతీలు , 1340 వార్డులకు పోలింగ్ జరుగనున్నది.