వికారాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సో మవారం షెడ్యూల్ విడుదలైంది. కాగా, ఈ ఎన్నికలకు జిల్లా యం త్రాం గం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకంతోపాటు పీవో, ఏపీవో, ఇతర పీవో అధికారు లను నియమించడంతోపాటు శిక్షణ కూడా పూర్తయ్యింది.
ఎన్నికలకు సరిపడా సిబ్బందిని నియమించడంతోపాటు ప్రతి మండలంలోనూ 20 శాతం అదనంగా కేంద్రాలను సిద్ధం చేసి సిబ్బంది ని నియమించారు. కాగా, జిల్లాలో 6,98,472 మంది ఓటర్లుండగా, అందులో పురుషులు 3,43,668 మంది, మహిళలు 3,54,788, ఇతరులు 16 మంది ఉన్నారు. బంట్వారంలో 17,589 మంది ఉండగా ..
పురుషులు 8,555 , మహిళలు 9034, బషీరాబాద్‌లో 40,990 మందిలో పురుషులు 19,452, మహిళలు 21,538, బొంరాస్‌పేటలో 32,121 మందిలో పురుషులు 15,896, మహిళలు 16,225, చౌడాపూర్‌లో 25,156 మందిలో పురుషులు 12,742, మహిళలు 12,413, ధారూరులో 36,261మందిలో పురుషులు 17,797, మహిళలు 18,464, దోమ లో 44,185మందిలో పురుషులు 22,056, మహిళలు 22129, దౌల్తాబాద్‌లో 40,977 మందిలో పురుషులు 20,019, మహిళలు 20,953 , ఇతరులు ఐదుగురున్నారు.
దుద్యాలలో 21,078 మందిలో పురుషులు 10,248, మహిళలు 10,830, కొడంగల్‌లో 32,205 మందిలో పురుషులు 15,782, మహిళలు 16,423, కోట్‌పల్లిలో 21,427 మంది లో పురుషులు 10,492, మహిళలు 10,935, కులకచర్లలో 38,387 మందిలో పురుషులు 19,066, మహిళలు 19,316, ఇతరులు ఐదుగురు ఉన్నారు.
మర్పల్లిలో 45,581 మందిలో పురుషులు 22,968 , మహిళలు 22,613, మోమిన్‌పేటలో 39,576 మందిలో పురుషులు 19,616, మహిళలు 19,959, నవాబుపేటలో 37,786మందిలో పురుషులు 18,935, మహిళలు 18,851, పరిగిలో 31,139 మందిలో పురుషులు 15,488, మహిళలు 15,650, ఇతరులు ఒక్కరు.
పెద్దేముల్లో 40,828 మందిలో పురుషులు 19,804, మహిళలు 21,024, పూడూరులో 43,593 మందిలో పురుషులు 21,738, మహిళలు 21855 , తాండూరులో 46,646 మందిలో పురుషులు 22686, మహిళలు 23,958, వికారాబాద్‌లో 24,237 మందిలో పురుషులు 11,928 , మహిళలు 12,309, యాలాలలో 38,710 మంది ఉండగా అందులో పురుషులు 18,400 మంది, మహిళా ఓటర్లు 20,309 మంది ఉన్నారు.
తారుమారైన నేతల తలరాతలు
రంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల రిజర్వేషన్లు తారుమారు కావడంతో పలువురు నేతల ఆశలు ఆవిరయ్యాయి. జడ్పీ చైర్మన్‌తోపాటు ఎం పీపీ, సర్పంచ్ పదవుల కోసం ఎన్నో ఏం డ్లుగా ఆశలు పెట్టుకున్న నేతలు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో లబోదిబోమంటున్నారు.
ముఖ్యంగా జడ్పీ చైర్మన్, ఎం పీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. రెండేండ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండడంతో ఎలాగైనా ఎన్నికల్లో పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉత్సాహంతో ఉన్న నేతలకు రిజర్వేషన్లు అనుకూలించలేదు. రంగారెడ్డి జడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు ఎంతో ఉత్సాహాన్ని చూ పారు. గతంలో జడ్పీ చైర్మన్ పీఠాన్ని జనరల్ మహిళకు కేటాయించగా…ఈసారి కూడా రిజర్వేషన్లు అలాగే ఉంటాయని భా వించగా ఆ సీటు ఎస్సీలకు రిజర్వు కావటంతో చాలామంది ఆశావహుల ఆశలు ఆవిరయ్యాయి.
కీలకంగా మారిన షాబాద్ జడ్పీటీసీ పీఠం..
రంగారెడ్డి జడ్పీ పీఠం రిజర్వేషన్లలో ఎస్సీలకు రిజర్వు అయ్యింది. అలాగే, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల జడ్పీటీసీలూ ఎస్సీలకే రిజర్వు కాగా.. ఈ ప్రాంతాల నుంచి గెలుపొందిన వారికే జడ్పీ చైర్పర్సన్ పదవి దక్కే అవకాశాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భీంభరత్ తన భార్య జ్యోతిని షాబాద్ నుంచి పోటీ చేయించి జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని యత్నిస్తున్నారు. అలాగే, షాబాద్‌కు చెం దిన బీఆర్ఎస్ నాయకుడు దేశమల్ల ఆంజనేయులు కూడా తన భార్య అరుణను పోటీలో నిలిపి బీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఆ పదవిని కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల నుంచి కూడా పలువురు నా యకు లు ఆ పదవిని పొందేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు.
ఎంపీపీల్లోనూ ఇదే పరిస్థితి..
జిల్లాలోని పలు మండల పరిషత్ స్థానాలు కూడా రిజర్వేషన్లలో ఆశావహులకు షాకిచ్చాయి. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, కందుకూరు, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలు కీలకమైనవి. ఈ మండలాల్లో ఎం పీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి కే పలువురు ఎంపీపీ పదవికి పోటీ చేస్తున్న ట్లు ప్రచారం కూడా చేసుకున్నారు.
కానీ, రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. అలాగే, సర్పంచ్ పదవులకు పోటీ చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారికి కూడా రిజర్వేషన్లు ఏ మాత్రం అనుకూలించలేదు. ఫ్యూచర్‌సిటీ పరిధిలోకి వచ్చే అనేక గ్రామపంచాయతీల సర్పంచ్‌లు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. దీంతో ఫ్యూచర్‌సిటీ గ్రామపంచాయతీల పరిధిలోని సర్పం చ్ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు గ్రామాల్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నా రు. కానీ, రిజర్వేషన్లు అనుకూలించక తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.
వేడెక్కిన రాజకీయం..
స్థానిక సంస్థల ఎన్నికలకు సోమవారం ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలోని 21 మండలా ల్లో 21 జడ్పీటీసీలు, 230 ఎంపీటీసీలు, 526 సర్పంచ్‌లు, 4,682 వార్డులున్నా యి. కాగా, జిల్లాలో ఓటర్లు 7,52,254 మంది ఉండగా.. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. సిబ్బందికి కూడా పలుమార్లు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించడంతో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పోటీచేసే అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు.