షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్లైట్స్తో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారుతోందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే షాద్‌నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన నూతన హైమాస్ట్ లైట్స్‌ను మంగళవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ హైమాస్ట్ లైట్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతన హైమాస్ట్ లైట్స్ ఏర్పాటుతో షాద్‌నగర్ మున్సిపాలిటీ విద్యుత్ కాంతులతో సరికొత్త శోభను సంతరించుకుందన్నారు.
మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా పట్టణానికి చెందిన ఎండీ గౌస్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 17వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ సలేంద్రం రాజేశ్వర్, నాయకులు జూపల్లి శంకర్, జమృత్‌ఖాన్, రజినీకాంత్ పాల్గొన్నారు.