Patnam Mahender Reddy | పోలియో మహమ్మారిని తరిమికొడదాం.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : పట్నం మహేందర్ రెడ్డి
Patnam Mahender Reddy : పోలియో మహమ్మారిని తరిమికొట్టి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి పౌరుడు కంకణ బద్దులు కావల్సిన అవసరం ఉందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
Patnam Mahender Reddy : పోలియో మహమ్మారిని తరిమికొట్టి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి పౌరుడు కంకణ బద్దులు కావల్సిన అవసరం ఉందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మునిసిపాలిటీ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదేళ్లలోపు పిల్లలకు మున్సిపల్ చైర్ పర్సన్ షాబాద్ సోనియా దర్శన్‌తో కలిసి పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని వ్యాక్సినేటర్లతో కలిసి 4 లక్షల 21 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 1618 పోలియో కేంద్రాలు, పట్టణ ప్రాంతంలో 493 గ్రామీణ ప్రాంతాల్లో 1195 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. పోలియో చుక్కల కేంద్రాలలో రెండు రోజులపాటు పోలియో చుక్కలను వేసే కార్యక్రమం సాగుతుందని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గంలో 32,000 మంది ఐదేళ్లలోపు వయస్సు గల పిల్లలకు పోలియో చుక్కలను వేస్తున్నట్లు తెలిపారు. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీం భరత్, మున్సిపల్ చైర్ పర్సన్ షాబాద్ సోనియా దర్శన్, మాజీ జెడ్పిటిసి కాలే శ్రీకాంత్, కంజర్ల భాస్కర్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్ర స్వామి, జిల్లా వైద్యాధికారి స్వర్ణ కుమారి, మండల వైద్యాధికారి అన్నపూర్ణ, సిహెచ్ఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, పిఎసిఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్, మండల శాఖ అధ్యక్షుడు మాణయ్య, సీనియర్ నాయకులు దేవరంపల్లి మహేందర్ రెడ్డి, కీసరి సంజీవరెడ్డి, బాలరాజ్ ముదిరాజ్, పట్నం రామ్ రెడ్డి, హన్మంత్ యాదవ్, గడ్డం వెంకట్ రెడ్డి, రవిందర్ రెడ్డి, కేబుల్ రాజు, సత్యనారాయణ, బాలకృష్ణారెడ్డి, విజయ రాజు, గణేష్ గౌడ్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

