రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో చిరుత మరోసారి పంజా విసిరింది. తాటిపర్తి గ్రామానికి చెందిన బైకని అంజయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల పాకపై బుధవారం రాత్రి చిరుత దాడికి పాల్పడింది. పాకలో ఉన్న రెండు లేగ దూడలపై దాడికి పాల్పడి, చంపుకు తిన్నది. చిరుత గ్రామ శివారులో ఇటీవల వరుస దాడులకు పాల్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిరుతను బందించేందుకు ఇప్పటికే అధికారులు పలు చోట్ల బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ చిరుత చిక్కకపోవటంతో అటు రైతులు, ఇటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.