ఆమనగల్లు / చేవెళ్లటౌన్ : మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ( Sabita Indra Reddy) పుట్టిన రోజు( Birthday ) సందర్భంగా పలువురు నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆమె నివాసంలో ఆమనగల్లు మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ( Nenavath Pathyanayak) సబితా ఇంద్రారెడ్డిని కలిసి పూలబోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఏఎంసీ డైరెక్టర్ రమేష్‌నాయక్, నాయకులు డేరంగుల వెంకటేష్, వరికుప్పల గణేష్ ఉన్నారు.
డీసీఎంఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో
పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ విద్యాశాఖ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన వేడులను ఘనంగా నిర్వహించారు. మహేశ్వరంలోని జిల్లెల గూడలో బీఆర్ఎస్ నాయకులు కలిసి కేక్ కట్ చేయించి సబితకు డీసీఎంఎస్( DCMS Chairman ) చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి ( Krishna reddy ) అధ్వర్యంలో బోకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకుంటూ ఉన్నత పదవులు చేపట్టి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అద్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, నాయకలు కృష్ణా, రాంప్రసాద్, ఎల్లయ్య తదితరులున్నారు.