ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్‌పై నామినేషన్ల దాఖలులో పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గులాబీ శ్రేణులు అక్కడ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, పాత నాయకత్వ పో రులో ఇమడలేక బయటికి వస్తున్నారు. అంతేకాకుండా రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలు నచ్చక చాలామంది నాయ కులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరుతున్నారు.
మర్పల్లి, డిసెంబర్ 1 : రేవంత్‌రెడ్డి పాలన నచ్చక ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మం డలంలోని కొంషెట్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, సుధాకర్‌యాదవ్, నయిమ్, ఇమ్రాన్‌తోపాటు 100 మంది కార్యకర్తలు మెతుకు ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు నాయబ్‌గౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ఆనందం పటేల్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బడెంపల్లిలో కాంగ్రెస్‌కు భారీ షాక్
దోమ : పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలంలోని బడెంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కవితాశ్రీనివాస్రెడ్డితోపాటు 60 మంది ఆ పార్టీ నాయకులు సోమవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నమ్మకంతో పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే ప్రజలకు మంచి జరిగిందన్నారు. కార్యక్రమంలో యువ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు లక్ష్మయ్య, కిష్టయ్య, లక్ష్మయ్య, మానిక్యా నాయక్ పాల్గొన్నారు.
సీఎం ఇలాకాలో బీఆర్ఎస్లో చేరికలు..
కొడంగల్ : రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని.. 23 నెలలు దాటినా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయ లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం దౌల్తాబాద్ మండలంలోని యాంకి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, మొగులప్ప, హన్మంతు, బందెప్ప, మొగులప్పతోపాటు 15 మంది మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రెండేండ్లు కావొస్తున్నా సంక్షేమ పథకాల ఊసేలేదని ఆరోపించారు. అన్నదాత లు అరిఘోస పడుతున్నారని పేర్కొన్నారు. గత కేసీఆర్ హయాంలో అన్నదాత వ్యవసాయం చేసుకుని సంతోషంగా జీవించగా.. రేవంత్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నాయ కులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారంటే.. రేవంత్‌పై ఎంత వ్యతిరేకం వచ్చిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కోట్ల మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుదాం
షాబాద్ : సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుదామని షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మండలంలోని సంకెపల్లిగూడ, బోడంపహాడ్ తదితర గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవినాశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్ సర్కార్‌కు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వంపై ప్రజ ల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడూరు నర్సింగ్ రావు, మాజీ సర్పంచులు కుమ్మరి దర్శన్, కృష్ణారెడ్డి, యాదిరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, రాందేవ్యాదవ్, వెంకట్‌రెడ్డి, రాజేంద్రారెడ్డి, చెన్నయ్య, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.